“రానా నాయుడు” సీజన్ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

“రానా నాయుడు” సీజన్ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Mar 7, 2024 3:02 PM IST

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరోస్ విక్టరీ వెంకటేష్ మరియు దగ్గుబాటి వారసుడు రామా నాయుడు(రానా) లు మెయిన్ లీడ్ లో నటించిన ఫస్ట్ ఎవర్ ఓటిటి సిరీస్ “రానా నాయుడు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకుంది. మెయిన్ గా దగ్గుబాటి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయేలా ఈ సిరీస్ కనిపించడంతో కాస్త నెగిటివ్ టాక్ కూడా అప్పుడు వచ్చింది.

కానీ ఓవరాల్ గా ఓటిటి లో ఈ సిరీస్ హిట్ కావడంతో సీజన్ 2 పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సీజన్ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సీజన్ ని మేకర్స్ ఈ మార్చ్ 25 నుంచి షూట్ స్టార్ట్ చేయనున్నట్టుగా సమాచారం. ఇక దీనిపై అధికారిక క్లారిటీ కూడా రానుంది అని టాక్. ఇక ఈ సిరీస్ ని సుపర్న్ వర్మ అలాగే అన్షుమన్ లు దర్శకత్వం వహించగా పాన్ ఇండియా భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు