తారక్ గ్రాండ్ షో పై లేటెస్ట్ న్యూస్.!

Published on Apr 22, 2021 8:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తో మరో భారీ సినిమాను ప్లాన్ చేసారు. అయితే ఇవి లైన్ లో ఉండగానే తారక్ స్క్రీన్ ప్రెజెన్స్ మళ్ళీ స్మాల్ స్క్రీన్ పైకి రెడీ అయ్యింది.

అప్పుడు బిగ్ బాస్ తో సెన్సేషన్ నమోదు చేసిన తారక్ ఈసారి “ఎవరు మీలో కోటీశ్వరులు”తో రెడీగా ఉన్నారు. అయితే ఇది అనౌన్స్ చేసినప్పుడే మంచి హైప్ ను సంతరించుకుంది. అయితే ఇప్పుడు ఈ షో పై లేటెస్ట్ టాక్ బయటకి వచ్చింది. ఈ షో కు సంబంధించి ఆఫ్ లైన్ లో పనులు అన్ని శరవేగంగా జరుగుతున్నాయి.

అంతే కాకుండా ప్రస్తుతం తిరుపతిలో ఈ షోలో పాల్గొనే అదృష్టవంతులు కోసం ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి. మరి ఈ ఆడిషన్స్ ఫిల్టర్ అయ్యాక నెక్స్ట్ తారక్ తో షో హోస్టింగ్ మాత్రమే బాకీ ఉందని చెప్పాలి. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :