‘ధమాకా’లో అప్పటి రవితేజ ను చూస్తారట !

‘ధమాకా’లో అప్పటి రవితేజ ను చూస్తారట !

Published on Dec 18, 2022 8:54 PM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా రాబోతున్న యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ధమాకా. శ్రీలీల హీరోయిన్ గా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో పాత రవితేజను చూడబోతున్నాం. ఇదే విషయాన్ని చెబుతున్నారు దర్శకుడు త్రినాధరావు. ఒక అభిమానిగా రవితేజ ను ఎలా చూడాల‌నుకున్నానో.. ఈ చిత్రంలో రవితేజను అలాగే చూపించాను. పదిహేను ఏళ్ల క్రితం రవితేజ పాత్రలు ఎలా ఉండేవో.. ఈ సినిమాలో రవితేజ పాత్ర అలాగే ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

కాగా ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ చేయనున్న సందర్భంగా త్రినాథ‌రావు మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ర‌వితేజ‌తో సినిమా చేయ‌డం నా కల అని అన్నారు. ఒక అభిమానిగా ఆయ‌నను ఎలా చూడాల‌నుకున్నానో.. ధమాకా సినిమాలో కూడా అలాగే చూపించానని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ప్రేక్ష‌కులు పాత ర‌వితేజ‌ను చూస్తారట. కాగా ధమాకా మూవీని డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు