లేటెస్ట్ : “టిల్లు స్క్వేర్” పాన్ ఇండియా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

లేటెస్ట్ : “టిల్లు స్క్వేర్” పాన్ ఇండియా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Apr 19, 2024 11:04 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం “టిల్లు స్క్వేర్” కోసం తెలిసిందే. మరి సాలిడ్ హైప్ నడుమ వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ మొదటి భాగం కంటే పెద్ద హిట్ కాగా ఈ సినిమాతోనే సిద్ధూ తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ ని అందుకున్నాడు.

అయితే థియేటర్స్ లో డీసెంట్ రన్ ని కొనసాగించిన ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటి రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది. మరి ఈ సినిమా హక్కులు సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు అఫీషియల్ డేట్ ని అయితే ఇచ్చేసారు. దీనితో ఈ చిత్రం ఈ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతుంది.

అలాగే ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. దీనితో ఈ చిత్రం తెలుగు సహా తమిళ్, కన్నడ, మళయాళం హిందీ భాషల్లో రానుంది. ఇక ఈ చిత్రానికి అచ్చు, రామ్ మిర్యాల అలాగే భీమ్స్ లు సంగీతం అందించగా సితార ఎంటెర్టైమెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు