“బ్రహ్మాస్త్ర” డే 1 వసూళ్లపై లేటెస్ట్ ప్రిడిక్షన్..!

Published on Sep 7, 2022 10:01 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అవైటెడ్ బాలీవుడ్ సినిమా “బ్రహ్మాస్త్ర”. గత కొన్నేళ్ల కాలంలో ఏ బాలీవుడ్ సినిమాకి కూడా లేని బజ్ ఈ సినిమాకి దక్కింది. మరి బాలీవుడ్ స్టార్ జంట రణబీర్ మరియు ఆలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ విజువల్ డ్రామా పై ఇప్పుడు అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి.

దీనితో ఈ సినిమా ఓపెనింగ్స్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈ చిత్రం కేవలం హిందీలోనే సుమారు 30 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని సినీ వర్గాల వారు ప్రిడిక్షన్స్ వేస్తున్నారు. మరి వరల్డ్ వైడ్ అయితే 50 కోట్లకి పైగానే రావచ్చని అంటున్నారు. మరి నిజంగానే బ్రహ్మాస్త్ర ఆ రేంజ్ వసూళ్లు అందుకుంటుందో లేదో తెలియాలి అంటే ఈ సెప్టెంబర్ 9వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :