“RRR” వాయిదా..ఆ రేస్ లో ఈ చిత్రాలు.?

“RRR” వాయిదా..ఆ రేస్ లో ఈ చిత్రాలు.?

Published on Aug 21, 2021 2:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఉక్రెయిన్ దేశంలో చేపట్టిన లాస్ట్ షెడ్యూల్ ని కూడా విజయవంతంగా మేకర్స్ కంప్లీట్ చేసేసి ఇక్కడికి వచ్చేసారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రం రిలీజ్ డేట్ పై కాస్త మిస్టరీ నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లోని అక్టోబర్ లో రాదు అని వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది అని సినీ వర్గాల్లో స్ట్రాంగ్ బజ్. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకొన్ని రోజుల్లో రానుండగా ఈ సినిమా రేస్ లో కొన్ని సినిమాలు నిలవనున్నట్టుగా టాక్. మరి వీటిలో ఆల్రెడీ వైష్ణవ్ తేజ్ “కొండ పొలం” చిత్రం అక్టోబర్ 8కి డేట్ లాక్ చేసుకోగా మరో చిత్రం కూడా ఇదే రేస్ లో నిలవడం దాదాపు ఖరారు అని తెలుస్తుంది.

అదే నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “అఖండ”. బోయపాటి మరియు బాలయ్య కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనితో ఈ చిత్రం విడుదల ఎప్పుడా అని ఆసక్తిగా చూస్తున్నారు. మరి వారందరికీ సమాధానం దొరుకుంటుందా లేదా అన్న దానిపై అధికారిక అప్డేట్ ఒకటే బ్యాలన్స్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు