ప్రభాస్ “సలార్” షూట్‌పై లేటెస్ట్ అప్డేట్..!

Published on Sep 13, 2021 9:04 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని పూర్తి చేయగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘సలార్’ మూవీని పూర్తిచేసే పనిలో ఉన్నాడు ప్రభాస్.

ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. గత రెండు షెడ్యూల్స్‌లోనూ యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించారు. అయితే తాజాగా వినిపిస్తున్న అలికిడి ఏమిటంటే మూడవ షెడ్యూల్‌ను కూడా ప్రశాంత్ నీల్ యాక్షన్ సీన్స్ కోసమే కేటాయించినట్టు తెలుస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే ఈ సినిమా బడ్జెట్‌లో సగం బడ్జెట్ కేటాయించారట. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :