“ఆచార్య” బ్యాలన్స్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on May 2, 2021 3:08 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పరిస్థితులు మునుపటిలా ఉండి ఉంటే ఈ మే నెలలోనే విడుదల కావాల్సి ఉంది కానీ పెరుగుతున్న కరోనా దృష్ట్యా వాయిదా వేశారు. అయితే ఈ చిత్రంలో ఇంకా ఎన్ని రోజులు షూట్ బ్యాలన్స్ ఉందో దానిపై బజ్ వినిపిస్తుంది.

ఆచార్య లో ఇంకా 15 రోజులు మేర షూట్ బ్యాలన్స్ ఉందట. ఇది అయ్యిపోతే ఇక మొత్తం కంప్లీట్ అయ్యిపోయినట్టే అని తెలుస్తుంది. అలాగే ఈ షూట్ లో ఇంకాఆ చరణ్ పై తియ్యాల్సిన కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఉన్నాయట. అవి అన్ని అయ్యిపోతే పోస్ట్ ప్రొడెక్షన్ పనులు మొదలు పెట్టి ఆగష్టు లో సినిమా విడుదల చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :