బాలయ్య సినిమా పై ఇంట్రెస్టింగ్ న్యూస్

బాలయ్య సినిమా పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Published on Mar 17, 2024 9:03 PM IST

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ప్రస్తుతం బాలయ్య ప్రజాగళం సభలో పాల్గొనడంతో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. కాగా తాజాగా ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య బాబు పూర్తిగా గడ్డం లుక్ లో కనిపిస్తాడని.. ముఖ్యంగా బాలయ్య రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.

మరి, ఈ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో బాలయ్య లుక్ ఎలా ఉంటుందో తెలియదు గానీ, ఈ న్యూస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ ఫుల్ గా ఉంటాయట. కాగా ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు