‘బాలయ్య’ ఒకరు కాదు, ఇద్దరు !

‘బాలయ్య’ ఒకరు కాదు, ఇద్దరు !

Published on May 14, 2019 1:55 PM IST

న‌ట‌సింహం నందమూరి బాల‌కృష్ణ హీరోగా దర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కథకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో బాలయ్య ఇద్దరు కవలల పాత్రల్లో నటిస్తున్నారట. అందులో ఒక పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు ‘రూలర్’ అని టైటిల్ పెట్టినట్లు సమాచారం. జ‌గ‌ప‌తిబాబు కూడా ఈ చిత్రంలో పవర్ ఫుల్ విల‌న్‌ గా న‌టించ‌బోతున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు. సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. మే 17న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుంది. అలాగే జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు