“హను మాన్” మేకర్స్ తదుపరి సినిమాపై లేటెస్ట్ అప్డేట్

“హను మాన్” మేకర్స్ తదుపరి సినిమాపై లేటెస్ట్ అప్డేట్

Published on Apr 19, 2024 2:30 PM IST

ఈ ఏడాది టాలీవుడ్ లో భారీ హిట్స్ అయ్యిన చిత్రాల్లో జనవరిలో వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం “హను మాన్” కూడా ఒకటి. మరి ఈ చిత్రంని నిర్మాణం వహించిన నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలతో టాలీవుడ్ లో రానుండగా ఇప్పుడు తమ నెక్స్ట్ సినిమాపై అయితే ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నట్టుగా సినిమాలో నటీనటుల పేర్లుతో ఓ మ్యారేజ్ సర్టిఫికెట్ తో చూపిస్తున్నారు.

రాఘవ్ ఆనందిలా పెళ్ళికి నిరంజన్ రెడ్డి అశ్విన్ రామ్ లు సాక్షులు అన్నట్టుగా నిర్మాత దర్శకుల పేర్లు పెట్టారు. మొత్తానికి అయితే ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ ని మేకర్స్ ఇపుడు అందించారు. అయితే ఈ ప్రాజెక్ట్ పై మరో బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రియదర్శి, నభా నటేష్ లు మెయిన్ లీడ్ లో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై రేపు ఏప్రిల్ 20 మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకి క్లారిటీ రానుంది. వేచి చూద్దాం ఈ కాంబినేషన్ లోనే వారి సినేమానా కాదా అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు