‘వార్ 2’లో యానిమల్ బ్యూటీ ?

‘వార్ 2’లో యానిమల్ బ్యూటీ ?

Published on Apr 15, 2024 7:07 AM IST

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. లాస్ట్ వీక్ నుంచి ఎన్టీఆర్ కూడా వార్ 2 కోసం ముంబైలో ల్యాండ్ అయ్యాడు. ప్రస్తుతం హృతిక్ – ఎన్టీఆర్ కలయికలో ఓ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నట్లు టాక్. ఐతే, ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపించాయి. తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ‘తృప్తి డిమ్రి’ నటించబోతున్నట్లు తెలుస్తోంది. యానిమల్ సినిమాతో తృప్తి డిమ్రి ఓవర్‌ నైట్ లోనే స్టార్‌గా మారింది.

ఈ క్రమంలోనే తృప్తి డిమ్రి ఇప్పుడు వార్ 2 లో కూడా నటించబోతుంది అన్నమాట. ఏది ఏమైనా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కాంబినేషన్ అంటే.. బాక్సాఫీస్ షేక్ అయినట్టే. కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు