కైకాల అంత్య క్రియలపై తాజా అప్డేట్.!

కైకాల అంత్య క్రియలపై తాజా అప్డేట్.!

Published on Dec 23, 2022 3:20 PM IST

Kaikala Satyanarayana 1

తెలుగు చలన చిత్ర దిగ్గజ నటుల్లో ఒకరైనటువంటి కైకాల సత్యన్నారాయణ గారు ఈరోజు కన్ను మూసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో టాలీవుడ్ ప్రముఖులు సహా అనేక మంది దక్షణాది ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఇదిలా ఉండగా కైకాల అంతిమ ప్రయాణంపై అయితే తాజాగా ఇప్పుడు అప్డేట్ తెలుస్తుంది.

ఆయన అంత్య క్రియలు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై అక్కడి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని కూడా ఈ కార్యక్రమంపై ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈరోజు వారి పార్థివ దేహాన్ని హైదరాబాద్ లోనే ఉంచగా రేపు మహాప్రస్థానంలో వారి అంతక్రియలు కుటుంబ సభ్యులు మరియు సినీ ప్రముఖుల నడుమ జరగనున్నాయి.

తాజా వార్తలు