‘మహేష్ – త్రివిక్రమ్’ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on Apr 19, 2021 8:10 am IST

ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించాడు దర్శకుడు త్రివిక్రమ్. అయితే తన తర్వాతి చిత్రాన్ని మొదట ఎన్టీఆర్ తో ప్లాన్ చేసి.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల మహేష్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని జూన్ లో మొదలుపెట్టి.. అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశారట.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందట. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీను తీసుకోవాలనుకుంటున్నారట. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా హారికా హాసిని క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :