మహేష్ ‘భరత్ అనే నేను’ షూటింగ్ పై సరికొత్త అప్డేట్!
Published on Nov 13, 2017 9:01 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివల కలయికలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే చిత్రంలోని ఒక కీలకమైన ఫైటింగ్ సన్నివేశాన్ని చిత్రీకరించిన టీమ్ నెక్స్ట్ షెడ్యూల్ ను పొల్లాచ్చిలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ ఈ నెల 26 నుండి మొదలుకానుంది.

ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశీ యాత్రల్లో ఉన్న మహేష్ ఈ నెల 20న తిరిగొస్తారని, 26 నుండి షూట్లో పాల్గొంటారని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్ నటి కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook