రజినీ “అన్నాత్తే” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Aug 20, 2021 9:00 pm IST

ప్రస్తుతం ఇండియన్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం “అన్నాత్తే”. కోలీవుడ్ హిట్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ స్థాయి అంచనాలే నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం షూట్ గత కొన్నాళ్ల కితమే మళ్ళీ షురూ అయ్యి శరవేగంగా జరుపుకుంటుంది. ఆ మధ్య హైదరాబాద్ లో షూట్ ని జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ టచ్ కి రెడీ అవుతుందట.

మరి ఈ షూట్ నిమిత్తమే కలకత్తా పయనమవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ రేపటి నుంచి నెలాఖరు వరకు బహుశా షూట్ ఉండొచ్చని ఇది కంప్లీట్ అయితే ఇక ఈ చిత్రం షూట్ అంతా కూడా కంప్లీట్ అయ్యిపోయినట్టే అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :