రామ్ ‘ది వారియర్’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on Apr 13, 2022 1:01 am IST

తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా రాబోతున్న సినిమా ‘ది వారియర్’. కాగా ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్ గా ఉంటుందట.

కాగా ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ ను దర్శకుడు లింగుస్వామి చూపించబోతున్నారు. రామ్ క్యారెక్టర్ కూడా పూర్తి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. పైగా రామ్ తొలిసారి పోలీస్ రోల్ చేస్తున్నారు. అదీ లింగుస్వామి దర్శకత్వంలో కావడం… ఇప్పుడీ ఈ సినిమాపై‌ అంచనాలను మరింత పెంచాయి.

ఎలాగూ కథ – కథనం పరుగులు పెట్టిస్తూ… సినిమాలు తీయడంలో లింగుస్వామి మంచి స్పెసలిస్ట్. అందుకే.. ‘ది వారియర్’ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అన్నిటికి మించి టాప్ టెక్నీషియన్లు, భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :