“సలార్” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Mar 13, 2021 8:00 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్” ఆల్రెడీ కంప్లీట్ అయ్యి రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక దీని తర్వాత మరో రెండు భారీ పాన్ ఇండియన్ చిత్రాలు “సలార్” మరియు “ఆదిపురుష్” అనే కంప్లీట్ డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. మరి ఇదిలా ఉండగా ఇప్పటికే సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. మరి ఈ గ్యాప్ లో ఆదిపురుష్ పని కూడా చూసుకున్నాడు.

అయితే ఇప్పుడు సలార్ షూట్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. మేకర్స్ మళ్ళీ ఓ కొండ ప్రాంతంలోనే సెట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ లో బొగ్గు మైనింగ్ ఏరియాలో భారీ సెట్స్ వేసి చేసారు. ఈసారి షెడ్యూల్ కి కూడా మళ్ళీ భారీ సెట్ వేసి చిత్రీకరించనున్నారట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దాదాపు కేజీయఫ్ టెక్నీకల్ టీమే పని చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :