“వారిసు” ట్రైలర్ పై లేటెస్ట్ అప్డేట్.!

“వారిసు” ట్రైలర్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Dec 31, 2022 5:01 PM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ “వారిసు” కోసం తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని “వారసుడు” గా రిలీజ్ చేస్తున్నారు. మరి తెలుగు సహా తమిళ్ లో కూడా భారీ అంచనాలు నెలకొల్పుకుంది. ఇక సంక్రాంతి కానుగా ఈ చిత్రం వస్తుండగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ పై అయితే సాలిడ్ అప్డేట్ వినిపిస్తుంది.

మరి దీని ప్రకారం అయితే ఈ జనవరి 2 న ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. లేదా ఆరోజు సినిమా ట్రైలర్ కి సంబంధించి అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. విజయ్ సినిమాల నుంచి వస్తే టీజర్ లేదా ట్రైలర్ మాత్రం వస్తూ ఉంటాయి. రెండు ఒకేసారి వచ్చిన సినిమాలు కూడా తక్కువే ఉన్నాయి. మరి ఈ సినిమాకి అయితే ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఈ సినిమా అయితే తమిళ్ తెలుగు సహా హిందీలో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు