‘భీమ్లా’ కోసం వరుణ్ తేజ్ “గని” వాయిదా..మేకర్స్ ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్!

Published on Feb 22, 2022 1:46 pm IST


ఏ సినిమా ఇండస్ట్రీ లో అయినా పలు భారీ సినిమాలు వస్తే కొన్ని సినిమాలు ఆగడం తాత్కాలికం.. మరి అలా ఈ ఏడాది సంక్రాంతి బరిలో పలు భారీ మార్పులు జరిగాయి కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ క్రేజీ మాస్ చిత్రం “భీమ్లా నాయక్” రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యడంతో ఆరోజు సినిమా డేట్స్ లాక్ చేసుకున్న మేకర్స్ పవన్ కి దారి ఇస్తున్నారు.

అల్రెడీ ఈ లిస్ట్ లో ఉన్న శర్వానంద్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ సినిమాలు మలి వారానికి వాయిదా వేసుకోగా ఇప్పుడు మేము పవర్ స్టార్ కి దారి ఇస్తున్నామని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన అవైటెడ్ చిత్రం “గని” చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.

భీమ్లా నాయక్ సినిమా వస్తుండడంతో మేము గని ని పోస్ట్ పోన్ చేశామని, కొత్త డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. అలాగే అందరితో పాటు తాము కూడా పవన్ సినిమా చూడడానికి ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. మరి దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :