ఆ సినిమాలో లావణ్య త్రిపాఠి నటించట్లేదా ?

Published on Jan 26, 2020 9:09 am IST

అర్జున్ సురవరం రూపంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠికి రీసెంట్ గా మంచి హిటే వచ్చింది. అయితే టాలెంట్ అండ్ గ్లామర్ ఉన్నా లావణ్య కెరీర్ ఆశించిన స్థాయిలో కొనసాలేదు. కనీసం ఈ అర్జున్ సురవరం సక్సెస్ తోనైనా కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లదామని అమ్మడు బాగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు ఎలా ఉన్నా.. ఓ యంగ్ హీరో సినిమాలో మాత్రం నటించబోతుందని వార్తలు వచ్చాయి. కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న “చావు కబురు చల్లగా” చిత్రంలో లావణ్య త్రిపాఠిను హీరోయిన్ గా తీసుకొవాలనుకున్నారు. కానీ ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నటించట్లేదట.

అన్నట్టు కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. త్వరలో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రానుంది. విభిన్నమైన పాత్రలో నటించే కార్తికేయ ఈ మూవీలో బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. దర్శకుడు కౌశిక్ చెప్పిన పాయింట్ నచ్చి నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను కార్తికేయతో చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More