బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షాక్ ఇచ్చింది. ముంబైలోని అంధేరీ వెస్ట్ ప్రాంతంలోని ఓషివారా ప్రాంతంలో ఓ అక్రమ కట్టడం నిర్మించి దాన్ని అద్దెకు ఇచ్చినందుకు బీఎంసీ ప్రియాంకకు లీగల్ నోటీసులు జారీ చేసింది. ప్రియాంక అక్రమ నిర్మాణం గురించి తెలుసుకున్న అధికారులు.. ఆ భవనం వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ నేపథ్యంలో భవనం నిర్మాణానికి అనుమతి లేదని తేలిన తర్వాత యజమానికి, భవనంలో ఉంటున్న వారికి లీగల్ నోటీసులు పంపారు.
కాగా నెల రోజుల్లో లోగా ఆ అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ ప్రియాంకకు గడువు పెట్టారు. అప్పటికి కూడా భవనాన్ని తొలగించకపోతే తాము బలవంతంగా కూల్చేస్తామని బీఎంసీ హెచ్చరించింది.


