చిట్ చాట్ : సతీష్ కుమార్ – ‘లెజెండ్’ మూవీ ‘ముద్దుగా’కి హెల్ప్ అవుతుంది.

చిట్ చాట్ : సతీష్ కుమార్ – ‘లెజెండ్’ మూవీ ‘ముద్దుగా’కి హెల్ప్ అవుతుంది.

Published on Mar 28, 2014 4:43 PM IST

sathish
ప్రింట్, వెబ్, ఎలక్ట్రానికి మీడియాలతో పాటు ఈనాడు, సాక్షి పత్రికల్లో కూడా పనిచేసి ప్రస్తుతం టాలీవుడ్ చానల్ లో ప్రోగ్రాం హెడ్ గా పనిచేస్తున్న సతీష్ కుమార్ దర్శకుడిగా మారి చేసిన సినిమా ‘ముద్దుగా’. సతీష్ కుమార్ డైరెక్టర్ విఎన్ ఆదిత్యకి బ్రదర్. సివి రెడ్డి సమర్పణలో 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై చేసిన ఈ సినిమాలో విక్రాంత్ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ నెల 29న రానున్న ఈ సినిమా విశేషాలను డైరెక్టర్ సతీష్ కుమార్ మాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) మీ మొదటి ప్రయత్నం ‘ముద్దుగా’ ఎలా ఉంటుంది?

స) కథా బలం ఉన్న సినిమా ‘ముద్దుగా’. ఒక అమ్మాయి తన కుటుంబ సభ్యులకి ఒక అబద్దం చెబుతుంది. కానీ అదికాస్తా నిజమైపోతుంది. దాంతో ఆ అమ్మాయికి సమస్యలు మొదలవుతాయి. అలా సమస్యల సుడిగుండంలో ఉన్న అమ్మాయిని హీరో ఎలా కాపాడాడు అనేదే కథ. లవ్, రొమాన్స్, ఫ్యామిలీ విలువలను సమపాళ్ళలో ఉండేలా ప్లాన్ చేసి తీసిన సినిమా ఇది. అందరూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు పేరేమో ‘ముద్దుగా’ అని పెట్టారని అడుగుతున్నారు మేము ఆ టైటిల్ ఎందుకు పెట్టాం అనేది మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది.

ప్రశ్న) మీ బ్రదర్ విఎన్ ఆదిత్య కథా పరంగా మీకు ఏమన్నా సహాయపడడం, సలహాలివ్వడం జరిగిందా?

స) మా బ్రదర్ విఎన్ ఆదిత్య కథ, ఎడిటింగ్ విషయాల్లో మాత్రం నాకు సహాయం చేసాడు. కానీ డైరెక్షన్ లో మాత్రం ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే ఆయన అదే టైంలో ‘పార్క్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

ప్రశ్న) ‘లెజెండ్’ లాంటి పెద్ద సినిమాతో పాటు సినిమాని రిలీజ్ చేయడం రిస్క్ అనిపించలేదా?

స) రిస్క్ ఏమీ అనిపించలేదు.. చెప్పాలంటే ‘లెజెండ్’ మూవీ రిలీజ్ ‘ముద్దుగా’ సినిమాకి ప్లస్ అవుతుంది. ఎలా అంటే ఈ మధ్య సినిమా బాగుంది అన్నా థియేటర్ కి వచ్చి చూసే వాళ్ళు కరువయ్యారు. ఇప్పుడైతే ‘లెజెండ్’ సినిమా కోసం ఫుల్ గా జనాలు వస్తారు. దాని కోసం వచ్చిన వాళ్ళు ఈ సినిమాని కూడా చూస్తారు అన్న ధైర్యంతోనే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం.

ప్రశ్న) ముందు నిర్మాతగా అనుకున్న విక్రాంత్ ని హీరోగా తీసుకోవడానికి గల కారణం ఏమిటి?

స) మేము కథ ఒకే అనుకున్న తర్వాత హీరో కోసం ట్రై చేసాం.. కొద్ది రోజులకి విక్రాంత్ నే హీరోగా పెడితే ఎలా ఉంటుందని అడిగితే నిజంగా పాత్రకి సరిపోతేనే ట్రై ట్రై చేద్దాం లేదంటే వేరే హీరోని తీసుకుందాం అన్నాడు. నేనే నచ్చజెప్పి మూవీ స్టార్ట్ చేసాం. విక్రాంత్ కి యాక్టింగ్ రాకపోయినా చెప్పింది చెప్పినట్టు చేయడంతో పాత్రకి 100% న్యాయం చేసాడు.

ప్రశ్న) ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు.. మరి మ్యూజిక్ ఎంత వరకూ హెల్ప్ అవుతుంది?

స) ఎంఎం కీరవాణి దగ్గర పనిచేసిన మధు పొన్నాప్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. కథకి మేము అనుకున్నదానికి సరిపోయే సంగీతం అందించాడు. పాటలన్నిటికీ బాగా వచ్చాయి. మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. రేపు సినిమా చూసాక మీరే ఆ విషయం చెబుతారు.

ప్రశ్న) చివరిగా సినిమా గురించి మా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు?

స) కుటుంబం అంతా చూడదగే విధంగా ఉండాలని కథ రాసుకొని చేసిన సినిమా ఇది. డబ్బు కోసం కాకుండా పాషన్ తో చేసిన సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చినందుకు టీం అంతా చాలా హ్యాపీగా ఉంది. సినిమా తీయడం దర్శకుడిగా నా చేతుల్లో ఉంది దాన్ని హిట్ చేయడం అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ప్రేక్షకులందరూ కచ్చితంగా థియేటర్ కి వెళ్లి ముద్దుగా సినిమా చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.

పక్కనే ఉన్న విక్రాంత్ చివరిగా మాట్లాడుతూ ‘ముందుగా వేరే హీరోని అనుకున్నా నేను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసి డైరెక్టర్ నన్ను ఎంచుకున్నారు. ఓ సినిమాకి హీరోగా, నిర్మాతగా వ్యవహరించడం ఎంత కష్టమో ఈ సినిమా చేసాకే తెలిసిందిసినిమా చూసాక బాగా నమ్మకం కలగడంతో మేమే ఓన్ గా సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులందరూ చూసి ఆదరిస్తారని’ అన్నాడు.

అంతటితో రేపు రిలీజ్ కాబోయే ‘ముద్దుగా’ సినిమా విజయవంతం కావాలని ఆల్ ది బెస్ట్ చెప్పి చిట్ చాట్ ముగించాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు