స్ట్రీమింగ్ కి వచ్చేసిన “లియో” ఇంగ్లీష్ వెర్షన్.!

స్ట్రీమింగ్ కి వచ్చేసిన “లియో” ఇంగ్లీష్ వెర్షన్.!

Published on Dec 12, 2023 9:00 AM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం “లియో” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం అనేక అంచనాలు నడుమ వచ్చి పర్వాలేదు అనిపించింది. మరి ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చిన తర్వాత కూడా భారీ రెస్పాన్స్ ని అయితే అందుకుంది. మరి నెట్ ఫ్లిక్స్ వారు ఈ చిత్రాన్ని మొదటగా పాన్ ఇండియా భాషల్లో ఇండియా అలాగే గ్లోబల్ గా కూడా చిన్న మార్పులతో తీసుకొచ్చారు.

మరి ఈ చిత్రం ఇంగ్లీష్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తామని అప్పుడే నెట్ ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు నేటి నుంచి అయితే ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసారు. మరి ఇంగ్లీష్ వెర్షన్ లో చూడాలి అనుకుంటే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని ట్రై చేయవచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు