నేడు సాయంత్రం లైగర్ నుండి కీలక ప్రకటన!

Published on Sep 27, 2021 11:20 am IST

విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా లైగర్. ఈ చిత్రం కి సంబంధించిన ఒక అప్డేట్ పై చిత్ర యూనిట్ తాజాగా ఒక ప్రకటన చేయడం జరిగింది. నేడు సాయంత్రం నాలుగు గంటలకు ఒక అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ లేదా విడుదల తేది పై నేడు సాయంత్రం ఒక క్లారిటీ రానుంది.

ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరణ్ జోహార్, ఛార్మి కౌర్, అపూర్వ మెహతా, హీరో యశ్ జోహార్ మరియు పూరి జగన్నాథ్ లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా, తనిష్క్ బాగ్ధి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :