“లైగర్” సెన్సేషన్..దెబ్బకి ఆల్ టైం ఇండియన్ రికార్డ్.!

Published on Jan 1, 2022 1:00 pm IST

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా “లైగర్”. మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి నిన్ననే మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చెయ్యగా దానికి అప్పుడే సాలిడ్ ఫీడ్ బ్యాక్ ఆడియెన్స్ నుంచి వచ్చింది.

మరి దానితో పాటుగా ఈ సినిమా ఏకంగా ఆల్ టైం ఇండియన్ రికార్డునే సెట్ చేసి పారేసింది. ఈ సినిమా గ్లింప్స్ కి గాను 24 గంటల్లో ఏకంగా 15.92 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టి ఆల్ టైం ఇండియా రికార్డు సెట్ చేసింది. మొత్తం రీజనల్, పాన్ ఇండియన్ సినిమాల్లో కూడా ఇప్పుడు లైగర్ సినిమాకే అత్యధికం.

దీని బట్టి ఈ సినిమాకి క్రేజ్ ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సాలిడ్ సినిమాలో మైక్ టైసన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఛార్మి మరియు కరణ్ జోహార్ లు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు 25న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :