లాక్ డౌన్ రివ్యూ : ‘బాల’ – హిందీ ఫిల్మ్ (డిస్నీ హాట్‌స్టార్ )

నటీనటులు: ఆయుష్మాన్ ఖురానా, భుమి పెడ్నేకర్, యామీ గౌతం

దర్శకుడు : అమర్ కౌశిక్

నిర్మాత : దినేష్ విజన్

ఛాయాగ్రాహకులు : అనుజ్ ధవన్

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సమీక్షగా వచ్చిన సినిమా ‘బాల’. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. కామెడీ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ హిందీ మూవీ డిస్నీ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథా నేపథ్యం :

బాల్ ముకుంద్ ( ఆయుష్మాన్ ఖురానా) 25 ఏళ్ల యువకుడు, అయితే అతనికి జుట్టు రాలిపోవడంతో పాటు మధుమేహంతో కూడా బాధపడుతుంటాడు. ఆ తరువాత జరిగిన సంఘటనల అంనంతరం అతను తన జుట్టును తిరిగి పొందడానికి అవకాశం ఉన్న ప్రతిదాన్ని ప్రయత్నిస్తాడు, కానీ జుట్టు పొందే విషయంలో మాత్రం మళ్లీ మళ్లీ విఫలమవుతాడు. ఇక చేసేదేం లేక విగ్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో పరి మిశ్రా (యామీ గౌతమ్)ను చూడటం, ఆమెను ఇష్ట పడటం, ఫైనల్ గా ఆమెను వివాహం చేసుకుంటాడు. అయితే పెళ్లి జరిగిన రెండవ రోజునే , బాలాకి బట్టతల ఉందని పరిమిశ్రా తెలుసుకుని అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఈ విషాద సంఘటన తరువాత బాల ముకుంద్ జీవితంలో ఏమి జరుగిందనేదే మిగిలిన కథ.

 

ఏం బాగుంది :

ఈ చిత్ర కథాంశంతో పాటు సినిమాలో ఇచ్చిన మెసేజ్ కూడా చాలా బాగుంది. జుట్టు రాలడం ఉన్న చాలా మందికి సినిమాలో కంటెంట్ చాలా సాపేక్షంగా ఉంటుంది. ఇక నటీనటుల నటనకు వస్తే.. తక్కువ ఆత్మగౌరవం తక్కువ ఆత్మవిశ్వాసం ఉన్న యువకుడిగా ఆయుస్మాన్ ఖుర్రానా నటన ప్రశంసనీయం. ముఖ్యంగా హీరో బట్టతల ద్వారా వచ్చే కామెడీ మొదటి భాగంలో చాల ఉల్లాసంగా ఉంటుంది. ఆయుష్మాన్ మరియు యామి గౌతమ్ మధ్య కెమిస్ట్రీ మరియు వారి టిక్ టాక్ ట్రాక్ కూడా చాలా బాగుంది. జాత్యహంకార సమస్యలతో పోరాడే న్యాయవాదిగా భుమి పెడ్నేకర్ అద్భుతంగా నటించింది. ఇక చిత్రం యొక్క క్లైమాక్స్ ఉద్వేగభరితమైనది.

 

ఏం బాగాలేదు :

సినిమా సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదిగా ఉండి పెద్ద సీరియస్‌గా సాగుతుంది. దాంతో కామెడీ ఆశించే వారు నిరాశ చెందుతారు. ఇక హీరోయిన్, ప్రాణంగా ప్రేమించే హీరోని కేవలం బట్టతల ఉన్నందున అతన్ని వదిలివేయడం నమ్మశక్యంగా అనిపించవు. అలాగే కొన్ని సన్నివేశాలు సరైన సమర్థనతో చూపించబడలేదు.

 

చివరి మాటగా :

మొత్తంమీద, బాల సినిమా ఈ మధ్య వచ్చిన ఎంటర్టైన్ మెంట్ చిత్రాలలో ఒకటి, అలాగే సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇక ఆయుష్మాన్ తన నటనతో మనల్ని బాగా ఆకట్టుకుంటాడు. అయితే కొంచెం నెమ్మదిగా సాగే రెండవ భాగం మాత్రం కొంతవరకు నిరాశ పరుస్తోంది. ఓవరాల్ గా ఈ చిత్రం ఈ లాక్ డౌన్ సమయంలో మంచి వినోదాత్మకమైన అనుభూతిని ఇస్తోంది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

123telugu.com Rating : 3.5/5

సంబంధిత సమాచారం :

X
More