లాక్ డౌన్ రివ్యూ: స్పెషల్ ఓ పి ఎస్ హిందీ వెబ్ సిరీస్(డిస్నీ -హాట్ స్టార్)

నటీనటులు: కే కే మీనన్, కరణ్ టాకర్, విపుల్ గుప్తా, ముజమ్మిల్ ఇబ్రహీం, సనా ఖాన్, మెహర్ విజ్, సైయామి ఖేర్, దివ్య దత్తా, వినయ్ పాథక్, సజ్జాద్ డెలాఫ్రూజ్

దర్శకత్వం: నీరజ్ పాండే, శివం నాయర్

నిర్మాత (లు): షిటల్ భాటియా

 

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు ఇన్వెస్టిగేటివ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ స్పెషల్ ఓప్స్ వెబ్ సిరీస్ ని ఎంచుకోవడం జరిగింది. డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

 

2001లో ఐదుగురు తీవ్రవాదులు ఇండియన్ పార్లమెంట్ భవనంపై దాడి చేస్తారు. ఆ దాడిలో పాల్గొన్న ఐదుగురు టెర్రరిస్టులు చంపబడతారు. ఐతే ఆ దాడిలో పాల్గొంది ఐదుగురు కాదు, ఆరుగురు అని భావించిన ‘రా’ ఆఫీసర్ హిమ్మత్ సింగ్(కె కె మీనన్) ఆ దాడి వెనకున్న ఆరవ టెర్రరిస్ట్ కోసం తన నలుగురు సభ్యుల టీంతో ప్రపంచ దేశాలలో వెతుకులాట మొదలుపెడతాడు. మరి ఆ టెర్రరిస్ట్ వారికి దొరికాడా లేదా అనేది మిగతా కథ..

 

ఏమి బాగుంది?

 

మంచి నటుడిగా పేరున్న కె కె మీనన్ రా ఆఫీసర్ గా తన ఎక్స్ట్రార్డినరీ పెరఫార్మెన్సు తో పాత్రకు పూర్తి న్యాయం చేశారు. తన టీమ్ ని గైడ్ చేసే ఇంటెలిజెంట్ ఆఫీసర్ గా ఆయన పాత్ర ఆకట్టుకుంది. టెర్రర్ అటాక్స్ ప్రభుత్వాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మొదటి ఎపిసోడ్స్ లో చక్కగా చూపించారు. అలాగే చివరి ఎపిసోడ్స్ వేగంగా సాగే కథనం, అలరించే ట్విస్ట్స్ తో ఆకట్టుకున్నాయి.

సీక్రెట్ ఏజెంట్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వారు ఇబ్బందులు, ఎదుర్కొనే ప్రమాదాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. వివిధ దేశాల్లో సాగే వెతుకులాట సన్నివేశాలు అలాగే నిర్మాణ విలువలు ఉన్నతంగా కున్నాయి. ఏజెంట్ ఫరూక్ పాత్రలో కరణ్ టాకర్ ఆకట్టుకున్నారు.

 

ఏమి బాగోలేదు?

 

ఆసక్తికరంగా మొదలైన ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత మూడు ఎపిసోడ్స్ ఆసక్తి లేకుండా నెమ్మదిగా సాగాయి. అసలు కథకు సంబంధం లేని కే కే మీనన్ చేసిన పాత్ర నేపథ్యంతో సాగదీశారు. కరణ్ టాకర్ మరియు సంజనమా మధ్య నడిచే కెమిస్ట్రీ మంచి అనుభూతిని పంచలేదు.

ఇక చాలా సన్నివేశాలు క్రియేటివిటి కోసం లాజిక్ వదిలేశారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లో ఉండే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ సిరీస్ లో మనకు కనిపించదు

 

చివరి మాటగా?

 

మంచి ఆరంభం, అలరించే చివరి ఎపిసోడ్స్ స్పెషల్ ఓప్స్ సిరీస్ ఆకర్షణీయంగా మలచాయి. కె కె మీనన్ నటన ఆకట్టుకొనే మలుపులు మరియు ప్రొడక్షన్ వాల్యూస్ మంచి అనుభూతిని ఇస్తాయి.పట్టులేని స్క్రీన్ ప్లే, మధ్యలో నెమ్మదించిన కథనం నిరాశ పరిచే అంశాలు. మొత్తంగా ఈ సిరీస్ చూడదగినదే.

Rating: 3/5

సంబంధిత సమాచారం :

More