యువ దర్శకుడికి రజనీ బంపర్ ఆఫర్

Published on Jan 24, 2020 9:24 am IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘వివేగం, విశ్వాసం’ ఫేమ్ శివ డైరెక్షన్లో ఒక చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్లనుండటంతో త్వరత్వరగా సినిమాలు చేస్తున్న రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం యువ దర్శకుడితో పనిచేయడానికీ రెడీ అవుతున్నారట. ఆ యువ దర్శకుడు మరెవరో కాదు లోకేష్ కనగరాజ్.

ఇటీవలే ‘ఖైదీ’ చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు లోకేష్. ఆ సినిమాతో ఆయనకు అవకాశాలు బాగా పెరిగాయి. స్టార్ హీరో విజయ్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో ‘మాస్టర్’ అనే చిత్రం రూపొందుతోంది. ఇది పూర్తయ్యేలోపు రజనీ కూడా శివ చిత్రాన్ని కంప్లీట్ చేసేస్తారు. అంటే 2020 మధ్యలోకి వీరి చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది. అయితే విడుదల మాత్రం 2021లోనే ఉంటుందట.

సంబంధిత సమాచారం :

X
More