సమీక్ష : “లవ్ మీ” ఇఫ్ యూ డేర్ – కన్ఫ్యూజ్ గా సాగే లవ్, హారర్ థ్రిల్లర్

సమీక్ష : “లవ్ మీ” ఇఫ్ యూ డేర్ – కన్ఫ్యూజ్ గా సాగే లవ్, హారర్ థ్రిల్లర్

Published on May 26, 2024 3:01 AM IST
Love Me Movie Review in Telugu

విడుదల తేదీ : మే 25, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: ఆశీష్ రెడ్డి, వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి, రాజీవ్ కనకాల, రవి కృష్ణ తదితరులు

దర్శకుడు: అరుణ్ భీమవరపు

నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, హర్షిత రెడ్డి

సంగీత దర్శకుడు: ఎం ఎం కీరవాణి

సినిమాటోగ్రఫీ: పి సి శ్రీరామ్

ఎడిటింగ్: సంతోష్ కామిరెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్

యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులు ఆశీష్ అలాగే వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా దర్శకుడు అరుణ్ భీమవరపు తెరకెక్కించిన వినూత్న హారర్ లవ్ స్టోరీ చిత్రమే “లవ్ మీ”. టీజర్, ట్రైలర్ లతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ:

ఇక కథలోకి వస్తే.. రామచంద్రపురం అనే ఊరిలో ఓ నవజంట వస్తుంది అయితే ఆ జంట ఓ ఇంట్లో దిగుతారు. కానీ ఆ ఇంటి నుంచి ఆరేళ్ళు ఆ వధువు ఇంటి గేట్ కూడా బయటకి వచ్చింది ఉండదు, ఆమెని ఎవరూ చూసింది కూడా ఉండదు. కానీ ఓనాడు ఆమె మరణిస్తుంది. ఇక మరోపక్క దయ్యాలు, ప్రకృతిలో వినూత్న అడ్వెంచర్స్ చేసే అర్జున్ (ఆశిష్) అలాగే తన అన్నయ్య ప్రతాప్ (రవి కృష్ణ) తో కలిసి యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తుంటారు. మరి ఈ క్రమంలో ప్రియా (వైష్ణవి చైతన్య) మూలన ఒక ఆంధ్ర, కర్ణాటక బార్డర్ లో పాడుబడ్డ అపార్ట్మెంట్ లో దివ్యవతి అనే దయ్యం కథ చెబుతుంది. మరి ఇది విన్న అర్జున్ అసలు దయ్యం సంగతి ఏంటో చూడాలని ఆ అపార్ట్మెంట్ కి వెళ్తాడు. మరి అలా వెళ్లిన తను దయ్యంతో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఆ దయ్యం అర్జున్ ప్రేమలో పడుతుందా లేక అతన్ని చంపేస్తుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? మొదటి కథకి ఈమెకి ఏమన్నా సంబంధం ఉందా లాంటిది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

మొదటి నుంచి ఈ సినిమా విషయంలో థీమ్ మంచి ఆసక్తిగా అనిపిస్తుంది. అదే విధంగా సినిమా లైన్ అనుసారం ఇంట్రెస్టింగ్ గానే కొనసాగుతుంది. అలాగే నటీనటుల్లో అయితే ఆశీష్ నటనలో చాలా పరిణితి కనిపిస్తుంది. మొదటి సినిమా రౌడి బాయ్స్ కంటే చాలా సెటిల్డ్ గా మంచి ఎక్స్ ప్రెషన్స్, మంచి బాడీ లాంగ్వేజ్ తో తాను ఈ సినిమాలో పెర్ఫామ్ చేసి ఆకట్టుకుంటాడు.

అలాగే వైష్ణవి చైతన్య మరోసారి తన సాలిడ్ పెర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేస్తుంది అని చెప్పాలి. మెయిన్ గా క్లైమాక్స్ లో ఆమె హావభావాలు ఎమోషన్స్ బాగున్నాయి. ఇక ఫస్టాఫ్ ఆసక్తి గా సాగుతుంది అని చెప్పాలి. సినిమా మొదలైన నాటి నుంచే ఆడియెన్స్ లో ఆసక్తిగొల్పేలా మంచి స్టార్ట్ కనిపిస్తుంది. అలాగే ఆశిష్, దయ్యంతో కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అలాగే మరికొన్ని సీన్స్ లో థ్రిల్స్ బాగున్నాయి. ఇంకా వైష్ణవి చైతన్య పై ఎమోషన్స్ బాగానే ఉన్నాయి.

అయితే దర్శకుడు చెప్పాలి అనుకున్న ప్రేమకథ బాగా ఎలివేట్ అయ్యింది. ప్రేమ విషయంలో తను చెప్పాలి అనుకున్న పాయింట్ జెనరల్ ఆడియెన్స్ కి నచ్చవచ్చు. ఇక మెయిన్ లీడ్ తర్వాత సిమ్రాన్ చౌదరి తన రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఇంకా రవి కృష్ణ కూడా బాగా చేసాడు. అలాగే రాజీవ్ కనకాల తదితరులు తమ పాత్రలు పరిధిలో ఆకట్టుకుంటారు. సినిమాలో కొన్ని స్పెషల్ సర్ప్రైజ్ లు కూడా కనిపిస్తాయి. అలాగే కొన్ని ట్విస్ట్ లు క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో ఫస్టాఫ్ డీసెంట్ గా ఆకట్టుకునేలా సాగుతుంది కానీ సెకండాఫ్ లో అసలు సమస్య మొదలవుతుంది. ఒక స్లో స్టార్ట్ తో సినిమా మొదలై ఒకింత కన్ఫ్యూజన్ తో సాగేలా అనిపిస్తుంది. మెయిన్ గా వైష్ణవి చైతన్య పాత్రని డెవలప్ చేసిన విధానం రచించదు. అందులో లాజికల్ గా ఆకట్టుకునేలా ఉండదు.

ఒకసారి ఒకరితో ప్రేమలో ఇంకోసారి ఇంకొకరితో ప్రేమలో ఉన్నట్టు చూపించడం పొంతన లేదు. అలాగే ఆమె పాత్రలోనే వేరే వాళ్ళ తన గుర్తింపు తీసుకోవడం వంటివి మెప్పించవు. ఈ క్రమంలో అసలు దర్శకుడు ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అర్ధం కాదు. అలాగే సినిమాలో పెద్దగా ఎంటర్టైన్మెంట్ కానీ సాలిడ్ ఎమోషన్స్ కానీ లేవు.

ఎక్కడో క్లైమాక్స్ మినహా ఇంకెక్కడా ప్రాపర్ ఎమోషన్స్ లేవు. అలాగే కొన్ని సీన్స్, పాత్రలపై చూస్తున్నప్పుడు వచ్చే అనుమానాలు నిజం అయిపోతాయి సో కొన్ని అంశాలు వీక్షకుడికి ముందే అర్ధం అయిపోతుంది. వీటితో కథనం ఒకింత సిల్లీగా, ఆడియెన్స్ లో చికాకు తెప్పించవచ్చు.

 

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి అంశానికి మేకర్స్ పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. ఇంకా ఆర్ట్ వర్క్ బాగుంది. కీరవాణి సంగీతం, పాటలు బాగున్నాయి. పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సంతోష్ కామిరెడ్డి ఎడిటింగ్ ఒకే కానీ సెకండాఫ్ లో కొన్ని సీన్స్ తగ్గించాల్సింది.

ఇక దర్శకుడు అరుణ్ భీమవరపు విషయానికి వస్తే.. తాను మంచి లైన్ రాసుకున్నాడు. దానికి అనుగుణంగా కొంతమేర కథనాన్ని ఆసక్తిగా నడపడంలో కూడా సక్సెస్ అయ్యాడు. మెయిన్ గా తాను రాసుకున్న ప్రేమ అంశం మెప్పిస్తుంది. కానీ ప్రేమ/హారర్ రెండు అంశాల్ని బ్యాలన్స్ చేయడంలో బాగా తడబడ్డాడు. మెయిన్ గా వైష్ణవి చైతన్య రోల్ లో లోపం కనిపిస్తుంది. పెర్ఫామెన్స్ పరంగా ఆమె 100 శాతం ఇచ్చింది కానీ ఆమె పాత్ర తీర్చి దిద్దిన విధానం సిల్లీగా డిజప్పాయింట్ చేస్తుంది. ఇక హారర్, థ్రిల్స్ ని ఇంకాస్త ఎక్కువ దట్టించి ఉంటే బాగుండేది. ఉన్నవి రెగ్యులర్ గానే అనిపిస్తాయి.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “లవ్ మీ” – ఇఫ్ యూ డేర్ సినిమాలో ఆశిష్ నటనలో మంచి పరిణితి కనిపిస్తుంది అలాగే వైష్ణవి చైతన్య కూడా మెప్పిస్తుంది. అలాగే ఫస్టాఫ్ ఓకే అనిపిస్తుంది కానీ.. లాజికల్ గా సాగని సెకాండఫ్, హీరోయిన్ పై వీక్ క్యారెక్టరైజేషన్, కొన్ని అంశాలు ముందే ఊహించదగేలా ఉండడం వంటివి ఈ సినిమాని చూసే ఆడియెన్స్ ని నిరుత్సాహ పరుస్తాయి. మెయిన్ గా దర్శకుడు లవ్, హారర్ లలో హారర్ థ్రిల్స్ అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. వీటితో అయితే ఈ చిత్రం మెప్పించలేకపోయింది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు