లవ్‌స్టోరీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్..!

Published on Oct 2, 2021 2:06 am IST


అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ” సినిమా సెప్టెంబర్‌ 24న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన పెద్ద సినిమా ఇదే. అయితే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? కలెక్షన్లు ఎలా ఉంటాయన్న అనుమానాలను ఈ సినిమా పటాపంచలు చేసిందనే చెప్పాలి.

ఈ సినిమా తొలి వారం కలెక్షన్లను ఓ సారి చూసుకుంటే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 27.5 కోట్ల షేర్ సాధించినట్టు తెలుస్తుంది. వారాంతం కావడంతో కలెక్షన్లు మరోసారి పుంజుకున్నాయి. కాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 31 కోట్లకు అమ్ముడయ్యాయి కాబట్టి ఈ సినిమాకి రెండవ వారం కలెక్షన్లు కీలకంగా మారనున్నాయి. మరీ ఈ సినిమా ఎంత మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :