మారి 2 ట్రైలర్ విడుదల తేదీ ఖరారు !

Published on Dec 4, 2018 11:22 am IST

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘మారి 2’ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇక ఈచిత్రం యొక్క ట్రైలర్ ను రేపు విడుదల చేసి చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21 న విడుదల చేయనున్నామని చిత్రం బృందం ఒక పోస్టర్ ద్వారా అధికారంగా ప్రకటించింది. సూపర్ హిట్ చిత్రం ‘మారి’ కి సీక్వెల్ గా వస్తున్నఈచిత్రాన్ని బాలాజీ మోహన్ తెరకెక్కించాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనెర్ గా రానున్న ఈ చిత్రంలో ‘ఫిదా’ ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.

యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ధనుష్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ వుండెర్ బార్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఇక ఇంతకుముందు మారి తెలుగులో ‘మాస్’ పేరుతో విడుదల కావడంతో ఈ చిత్రం మాస్ 2′ పేరుతో తెలుగులోనూ విడుదలయ్యే అవకాశాలు వున్నాయి. ఇక ఇదీలావుంటే సాయి పల్లవి నటించిన ఈ చిత్రం మరియు తెలుగులో నటించిన ‘పడి పడి లేచె మనసు’ ఒకే రోజు ప్రేక్షకులముందుకు రానున్నాయి.

సంబంధిత సమాచారం :