త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “మ్యాడ్”

త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “మ్యాడ్”

Published on Dec 31, 2023 6:09 PM IST

సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉదయన్ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

త్వరలో ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు