మాధవన్ కొత్త సినిమా వివరాలు !

1st, April 2018 - 11:42:06 AM

మంచు విష్ణు తో వస్తాడు నారాజు సినిమాకు దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ త్వరలో కొత్త సినిమ ప్రారంభించబోతున్నాడు. మాధవన్ ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో నిర్మించబోతున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత గోపి మోహన్ కథ అందించడం జరిగింది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు. కొత్త కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మాధవాన్ ప్రస్తుతం నాగ చైతన్య సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మాధవన్ చెయ్యబోయే తెలుగు సినిమా ఇదే అవ్వడం విశేషం. రచయిత గోపి మోహన్ ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్, సాగర్ చంద్ర సినిమాకు వర్క్ చేస్తున్నారు. త్వరలో ఈ రైటర్ దర్శకుడిగా మారబోతున్న సంగతి తెలిసిందే.