విడుదల కి సిద్దమవుతున్న “మధుర వైన్స్”

Published on Aug 20, 2021 6:05 pm IST

సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో ఆర్ కె సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండెపు నిర్మాతగా జయ కిషోర్ బండి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మధుర వైన్స్. గతం, తిమ్మరుసు లాంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్ సృజన్ యారబోలు ఈ సినిమా కి అసోసియేట్ కావడం తో ఇండస్ట్రీ లో ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది.

ఎస్ ఒరిజనల్స్ నుంచి అద్భుతం, పంచతంత్రం చిత్రాలు కూడా రాబోతున్నాయి అని, మధుర వైన్స్ సినిమా కి సంబంధించిన ప్రచార చిత్రాలు, సాంగ్స్ ట్రైలర్స్ ప్రేక్షకులని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి అని, సినిమా ఆహ్లాదకరంగా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. సెప్టెంబర్ 17న మధుర వైన్స్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని వెల్లడించారు. ఈ సినిమాకు మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కార్తిక్ కుమార్, జయ్ క్రిష్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు దర్శక నిర్మాతలు.

సంబంధిత సమాచారం :