నితిన్ “మాస్ట్రో” ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Aug 20, 2021 5:07 pm IST


నితిన్ హీరోగా, నబ్బా నటేష్ మరియు తమన్నా భాటియా లు కథానాయికలు గా నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2018 లో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన అంధదూన్ చిత్రానికి ఇది రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వం లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం డైరక్ట్ ఓటిటి గా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల కి సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి వచ్చింది. ఆగస్ట్ 23 వ తేదీన సాయంత్రం అయిదు గంటలకు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. అంతేకాక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ పై త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :