‘మహా సముద్రం’ నుండి ఆకట్టుకుంటున్న చెప్పకే చెప్పకే !

‘మహా సముద్రం’ నుండి ఆకట్టుకుంటున్న చెప్పకే చెప్పకే !

Published on Sep 6, 2021 9:10 PM IST


టాలెంటెడ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో శర్వానంద్ – సిద్ధార్ద్ కీలకపాత్రలుగా రాబోతున్న ‘మహా సముద్రం’ నుండి చెప్పకే చెప్పకే లిరికల్ వీడియో సాంగ్ ఈ రోజు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కాగా సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక శర్వానంద్ తన కెరీర్ లో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రను ఈ సినిమాలోనే చేస్తున్నాడట.

పైగా ఈ చిత్రంలో ఇంట్రస్టింగ్ ప్రేమకథ కూడా ఉందని.. సినిమాలో హీరోయిన్ పాత్రకు సంబంధించిన ట్రాక్ కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందట. కాగా వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ హీరో అనే ఇమేజ్ ఉన్న శర్వానంద్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ పాత్రలో ఎలా కనిపిస్తాడో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు