ఎన్నో ఏళ్ల నుంచి ఈ కథతో ప్రయాణం చేస్తున్నా – అమీర్ ఖాన్

ఎన్నో ఏళ్ల నుంచి ఈ కథతో ప్రయాణం చేస్తున్నా – అమీర్ ఖాన్

Published on Jun 1, 2025 11:00 PM IST

Aamir Khan m

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్ ఖాన్ ‘సితారే జమీన్‌ పర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ అమీర్ ఏం మాట్లాడారు అంటే.. ‘ప్రస్తుతానికి నా ఫోకస్‌ మొత్తం ‘సితారే జమీన్‌ పర్‌’ పైనే. మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని ఒక భారీ ప్రాజెక్ట్‌ రూపొందించాలనేది నా కోరిక. ప్రస్తుత సినిమా విడుదలయ్యాక నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై దృష్టి పెడతాను. దానిని భారీ స్థాయిలో రూపొందించాలని అనుకుంటున్నాను’ అని అమీర్ చెప్పారు.

అమీర్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో చూసే ప్రతి విషయం మహాభారతంలో భాగమే. ఇందులో ఎన్నో కోణాలు, భావోద్వేగాలు ఉన్నాయి. నేటితరం ప్రేక్షకులకు దానిని అందించాలంటే భారీ స్థాయిలోనే సిద్ధం చేయాల్సి ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ కథతో ప్రయాణం చేస్తున్నా. వెండితెర వేదికగా అద్భుతంగా దీనిని ప్రేక్షకులకు చూపించాలని కలలు కంటున్నా. అయితే ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో నటుడిగా చేయడానికి ఇక ఏమీ లేదనే భావన నాకు కలుగుతుందనుకుంటున్నా. ఒక నటుడిగానే నాకు చనిపోవాలని ఉంది’’ అని అమీర్ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు