సావిత్రి పుట్టినరోజున సర్ప్రైజ్ ఇవ్వనున్న ‘మహానటి’ టీమ్ !
Published on Dec 5, 2017 2:32 pm IST

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ‘మహానటి’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో కనువిందు చెయ్యనుంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీకి సంబందించి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసారు చిత్ర యూనిట్.

డిసెంబర్ 6 అనగా రేపు సావిత్రి జయంతి సందర్భంగా ‘మహానటి’ సినిమాకు సంబందించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ను విడుదలచేయనున్నారు. ఆ అప్డేట్ పోస్టరా, టీజరా లేకపోతే వేరే ఏదైనా అయ్యుంటుందా అనేది చూడాల్సి ఉంది. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్నఇందులో సమంతతో పాటు విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, దుల్కర్ సల్మాన్ వంటి ప్రముఖ నెట్న టులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

 
Like us on Facebook