పాజిటివ్ మౌత్ టాక్ ను సొంతం చేసుకున్న ‘మహానుభావుడు’ !

శర్వానంద్ హీరోగా మారుతి తెరకెక్కించిన ‘మహానుభావుడు’ చిత్రం ఈరోజే విడుదలైంది. మొదట్లో అందరూ ఎన్టీఆర్, మహేష్ బాబుల భారీ చిత్రం నడుమ వస్తున్న ఈ సినిమా పరిస్థితి ఏమిటా అని సందేహం వ్యక్తం చేశారు. కానీ ఉదయం ప్రదర్శింపబడిన మొదటి షో నుండే సినిమాకు మంచి పాజిటివ్ మౌత్ టాక్ లభిస్తోంది. ఇప్పటికే సినిమా హిట్ అని ఖాయమైపోయింది. దీంతో ఈ ఏడాది ఆరంభంలో చిరు, బాలక్రిష్ణలతో సినిమాలతో పాటే వచ్చి హిట్ అందుకున్న శర్వా ఆ మ్యాజిక్ ను రిపీట్ చేసినట్టైంది.

అతి శుభ్రత (ఓసిడి) అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రంలో హీరో పాత్ర, ప్రవర్తన, శర్వానంద్ నటన, మారుతి దర్శకత్వం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. విమర్శకులు సైతం చిత్రానికి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం, ఓవర్సీస్ టాక్ కూడా బాగుండటంతో సినిమా వసూళ్లు మంచి స్థాయిలోనే ఉండి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు మిగలనున్నాయి. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది.