మీరాబాయ్ చానుకి మహేష్, పవన్ ల అభినందనలు.!

Published on Jul 24, 2021 6:57 pm IST


దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2020 టోక్యో ఒలింపిక్స్ నిన్ననే ఎంతో అట్టహాసంగా చాలా గ్రాండియర్ గా మొదలయ్యింది. మరి నిన్ననే మొదలు అయిన ఈ ఒలింపిక్స్ లో ఈ ఒక్క రోజు వ్యవధిలోనే భారత్ కు విమెన్ వెయిట్ లిఫ్టింగ్ లో మణిపూర్ కి చెందిన “మీరాబాయ్ చాను” అనే మహిళా క్రీడాకారిణి వెండి పథకం కైవసం చేసుకొని శుభారంభాన్ని ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. మరి ఈ విజయంపైనే సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కూడా స్పందించి తమ అభినందనలు ఆమెకి తెలిపారు.

మొదటగా మహేష్ “ఈ ఒలింపిక్స్ ఆరంభంలోనే భారత్ కు సిల్వర్ మెడల్ అందించిన మీరాబాయ్ చాను కి పెద్ద కంగ్రాట్స్ తెలుపుతున్నాను, ఈ యాక్షన్ భారత్ కి జస్ట్ బిగినింగ్ మాత్రమే” అని తన స్టైల్ లో ఎనర్జిటిక్ గా తెలియజేసారు.

ఇక పవన్ అయితే “మీరాబాయ్ చాను విజయం దేశానికే గర్వకారణం అని, టోక్యో ఒలింపిక్స్ లో మన దేశానికి తొలి పతకం అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను గారికి నా తరపున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు. ఒలింపిక్స్ లో 20ఏళ్ల తరవాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కరణం మల్లీశ్వరి గారి తరవాత మీరాబాయి చాను గారు పతకం సాధించి, దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులందరికీ సంతోషాన్ని కలిగించారు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన మీరాబాయి చాను అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విధం, ఆమెలోని పోరాటపటిమ యువతకు స్ఫూర్తినిస్తాయి. టోక్యో ఒలింపిక్స్ లో ఆమె సాధించిన రజత పతకం కచ్చితంగా మిగిలిన విభాగాల్లోని మన క్రీడాకారుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. మీరాబాయి చాను లాంటి క్రీడాకారిణులు దేశానికి గర్వకారణంగా నిలుస్తారు”. అని పవన్ కూడా తనదైన శైలిలో తన స్పందనను తెలియజేసారు.

మరి ప్రస్తుతం అయితే మహేష్ తన “సర్కారు వారి పాట” లో బిజీగా ఉండగా పవన్ లు తన సినిమాలు సహా పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :