మహేష్, రాజమౌళి సినిమాపై మరో లెవెల్ కి వెళ్తున్న హైప్.!

Published on Jan 17, 2023 3:59 pm IST


ప్రస్తుతం మన ఇండియా సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ కాంబినేషన్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మాసివ్ స్కేల్ ఉన్న చిత్రం కూడా ఒకటి. అయితే ఈ చిత్రం మొదట నార్మల్ గానే అనౌన్స్ అయినా ఇప్పుడు ఈ చిత్రం ఈ చిత్రం ఉండి ఉండి వేరే లెవెల్ కి వరల్డ్ సినిమాగా వెళ్ళింది. అయితే ఇప్పుడు తన RRR సక్సెస్ తో వరల్డ్ వైడ్ రాజమౌళి పేరు ఓ బ్రాండ్ గా మారిపోయింది.

దీనితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినటువంటి దర్శకుడు రాజమౌళి తో మహేష్ చేయనున్నటువంటి సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. అలాగే రాజమౌళి హాలీవుడ్ లో ఎంతమంది హాలీవుడ్ దిగ్గజ దర్శకులని కలవడం మరింత కేజ్రీగా మారగా మహేష్ సినిమాపై హైప్ అక్కడ నుంచి అంతకంతకూ పెరుగుతుంది. ఎలాగో ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం పాన్ వరల్డ్ లెవెల్లో ఎలాంటి రిలీజ్ ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :