రీసౌండ్లు పుట్టిస్తున్న మహేష్ బాబు ప్రమాణస్వీకారం !

మహేష్ బాబు, కొరటాల కాంబినేషన్లో భరత్ అనే నేను చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా సరికొత్త పంథాని ఫాలో అయ్యారు. ఫస్ట్ ఓత్ పేరుతో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆడియోని సోషల్ మీడియాలో, మరియు ఎఫ్ ఎమ్ రేడియోలలో వదిలారు.

దాదాపు నిమిషం ఉన్న ఈ ఆడియోలో మహేష్ బాబు తన వాయిస్ లోని బేస్ తో అభిమానులని అరెస్ట్ చేసేశాడు. దేవిశ్రీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మహేష్ ప్రమాణానికి తోడు కావడంతో అలా వింటూ ఉండిపోతాం. మహేష్ బాబు ప్రమాణం గంభీరంగా, ప్రొఫెషనల్ గా ఉంది. భరత్ అనే నేను అంటూ మొదలు పెట్టి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ మహేష్ ముగిస్తాడు. ఇప్పటికే మహేష్ ప్రమాణం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

భరత్ అనే నేను ఫస్ట్ ఓత్ వినడానికి క్లిక్ చేయండి: