విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్న మహేష్ బాబు !

ఈ ఏడాది విడుదలకానున్న భారీ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క ‘భరత్ అనే నేను’ కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో తారాస్థాయి అంచనాలున్నాయి. విడుదల తేదీ ఏప్రిల్ 27 దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ఎడతెరిపి లేకండా కష్టపడుతోంది.

ముఖ్యంగా మహేష్ అయితే షాట్ షాట్ కి మధ్యన పెద్దగా గ్యాప్ కూడా తీసుకోవడంలేదట. అంతేగాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తికావాలని దగ్గరుండి యూనిట్ సభ్యుల్లో ఉత్సాహం నింపుతూ ప్రోత్సహిస్తున్నారట. ఫిబ్రవరి నెలాఖరున పూణేలో, దాని తర్వాత 16 రోజులపాటు ఫారిన్లో షూటింగ్ జరుపుకోనుందీ చిత్రం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు.