వైరల్ : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మహేష్ లేటెస్ట్ స్టన్నింగ్ లుక్.!

Published on Aug 14, 2022 10:30 am IST

ఒక్క మన టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఎవర్ చార్మింగ్ స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పాలి. మొన్ననే 47ఏళ్ళు పూర్తి చేసుకున్నా కూడా అదే యంగ్ అండ్ చార్మింగ్ లుక్స్ తో మహేష్ సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు.

ఇక లేటెస్ట్ గా అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో భారీ సినిమాకి సిద్ధం అవుతున్న మహేష్ గత కొంత కాలం నుంచి కొత్త లుక్ ని అయితే ప్రిపేర్ చేస్తుండగా కొన్ని ఆఫ్ లైన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా మహేష్ నుంచే ఓ స్టన్నింగ్ లుక్ బయటకి రాగా ఇది సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.

బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తున్న ఈ ఫొటోలో మహేష్ సరికొత్త హెయిర్ స్టయిల్ మరియు లైట్ గా మళ్ళీ మీసం గడ్డం పెంచి చాలా కొత్తగా కనిపిస్తున్నారు. దీనితో మహేష్ పెట్టిన ఈ ఫోటో పోస్ట్ అభిమానులకి మంచి కిక్ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మరి ఇదే లుక్ నెక్స్ట్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో కూడా ఉంటుందా అని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :