మహేష్ బాబు నుండి మరో అదిరిపోయే మల్టీప్లెక్స్ !

Published on Jan 25, 2020 5:51 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్లోకి ప్రవేశించి ఏఎంబీ సినిమాస్ పేరుతో హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో అధునాతన హంగులతో మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. మహేష్ చరీష్మా కారణంగా అతి తక్కువ కాలంలోనే ఏఎంబీ సినిమాస్ చాలా బాగా పాపులర్ అయింది. సెలబ్రిటీలు సైతం కుటుంబాలతో కలిసి అక్కడే సినిమాలు చూస్తున్నారు.

ఏఎంబీ సినిమాస్ నిర్మించినందుకు మహేష్ కు ఏఎంబీ బృందానికి ప్రేక్షకులకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. అంతలా అది పాపులర్ అయింది. కాగా తాజాగా మహేష్ మరో అధునాతన హంగులతో అదిరిపోయే మల్టీప్లెక్స్ ను బెంగళూరు నగరం నడిబొడ్డున నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తను ఇంకా ధృవీకరించబడలేదు గాని, ఫిల్మ్ సర్కిల్స్‌లో మాత్రం ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఎలాగూ కర్ణాటకలో తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More