వెకేషన్ నుంచి తిరిగొచ్చిన మహేష్!

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. మహేష్, మురుగదాస్ లాంటి స్టార్ యాక్టర్, డైరెక్టర్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాకు ఇప్పట్నుంచే ఎక్కడిలేని క్రేజ్ కనిపిస్తోంది. ఇక కొద్దిరోజుల క్రితం ఈ సినిమా హైద్రాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన మహేష్, వారం రోజులుగా దుబాయ్‍కి వెకేషన్‌పై వెళ్ళారు. తన కుమారుడు గౌతమ్ పుట్టినరోజును కూడా అక్కడే జరిపిన మహేష్, నిన్న సాయంత్రం తిరిగి హైద్రాబాద్ చేరుకున్నారు.

మురుగదాస్ సినిమాకు సంబంధించి చెన్నైలో జరిగే భారీ షెడ్యూల్‌లో మహేష్ రేపట్నుంచి జాయిన్ అవుతున్నారు. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.