ఫ్యాన్స్ ని బ్యూటిఫుల్ రిక్వెస్ట్ అడిగిన మహేష్.!

Published on Aug 6, 2021 3:43 pm IST


మన దక్షిణాట ఉన్న సినిమా ఇండస్ట్రీ ప్రతీ దాంట్లో ఉన్న స్టార్ హీరోలను దైవం కన్నా ఎక్కువగా తమ అభిమానులు కొలుస్తారు అన్నది అందరికీ తెలుసు. అలాంటిది వారి అభిమాన హీరో బర్త్ డే వస్తుంది అంటే ఇక అక్కడ నుంచి వారి అభిమానులు చేసే హంగామా కూడా ఇంకో లెవెల్లో ఉంటుంది.

కానీ ఆ అభిమానులను సరైన మార్గంలో నడిపించే హీరోకే మరింత గౌరవం కూడా దక్కుతుంది. మరి ఇప్పుడు మహేష్ కూడా అదే చేసారు. రానున్న ఆగష్టు 9న తన బర్త్ డే సందర్భంగా మహేష్ అభిమానులు భారీ ప్లానింగ్స్ వేసి పెట్టుకున్నారు. అయితే మరి ఆ స్పెషల్ డే కి తన పై ఉన్న ప్రేమను మరోరకంగా చూపించమని బ్యూటిఫుల్ మెసేజ్ అండ్ రిక్వెస్ట్ ని అడిగారు.

“ప్రకృతిని పచ్చగా సమతుల్యంగా ఉంచాలన్నా కాలుష్యాన్ని తగ్గించాలన్నా విత్తనాలు నాటి మొక్కలను పెంచి సాధ్యం చెయ్యండి ఇలా మీరు నా మీద ఉన్న మీ ప్రేమను వ్యక్తపరచండి” అని మహేష్ తన అభిమానులకి ఈ విన్నపం అందించారు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న “సర్కారు వారి పాట” బ్లాస్టర్ అప్డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :