మహేష్ తీరు పూర్తిగా మారిపోయింది..!

Published on Feb 27, 2020 8:10 am IST

టాలీవుడ్ చార్మింగ్ హీరోగా పేరున్న మహేష్ చాలా మొహమాటస్తుడు.కెరీర్ బిగినింగ్ నుండి మహేష్ పబ్లిక్ వేడుకలలో అసలు పాల్గొనేవారు కాదు. తప్పదు అనుకుంటే తప్ప తన చిత్రాల విజయోత్సవ కార్యక్రమాలలో కనిపించేవారు. ఇక మహేష్ ఇతర హీరోలతో కూడా అంత సాన్నిహిత్యం మరియు స్నేహం కలిగి ఉండేవారు కాదు. వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ తన కంటూ ఓ సపెరేట్ మేనరిజం, ఆటిట్యూడ్ మైంటైన్ చేసేవారు. కానీ కొన్నాళ్లుగా మహేష్ తీరులో చాల మార్పు వచ్చింది. ఆయన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటున్నారు.

అలాగే టాలీవుడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి వంటి వారితో మంచి స్నేహం కొనసాగిస్తున్నారు. వీటన్నింటికీ మించి మెగాస్టార్ సినిమాలో రోల్ చేయడానికి ఒప్పుకొని సంచలనం నమోదు చేశారు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణం రాజు, నాగేశ్వర రావు వంటి స్టార్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్స్ చేశారు. మహేష్ సైతం ఇప్పటికే వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశారు. ఇప్పుడు ఏకంగా చిరు మూవీలో ఎక్కువ నిడివి కలిగిన క్యామియో రోల్ చేస్తున్నారు. ఇవ్వన్నీ గమనిస్తుంటే మహేష్ తీరులో ఇంత మార్పా అని ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత సమాచారం :