అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిస్తున్న ‘స్పైడర్’ టీజర్ !
Published on Aug 9, 2017 9:32 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘స్పైడర్’ టీజర్ ఎట్టకేలకు ఈరోజు ఉదయం విడుదలైంది. దీంతో ఈ టీజర్ కోసం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేసేస్తున్నారు. పైగా ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో వాళ్ళ ఆనందం రెట్టింపైంది. ఇక టీజర్ విషయానికొస్తే ఎక్కువగా సినిమాలోని యాక్షన్ కంటెంట్ ను ఎలివేట్ చేసే విధంగా ఉందీ టీజర్.

మహేష్ తో పాటు విలన్ పాత్ర చేస్తున్న ఎస్.జె సూర్య చెప్పే డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సులు బాగా ఆకట్టుకుంటున్నాయి. వాటికి హారీశ్ జైరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్ఫెక్ట్ గా సెట్టైపోయింది. దీంతో సినిమాపై కూడా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో నమ్మకాలు ఇంకాస్త పెరిగాయి. తెలుగుతో పాటు తమిళంలో కూడా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

టీజర్ కొరకు క్లిక్ చేయండి

 
Like us on Facebook